కొందరు అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను సైతం మాయ చేసేలా వారి తీరు ఉందని అసెంబ్లీలో మండిపడ్డారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో జరిగిన సంభాణషలోని పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్బంగానే మంత్రులు అడుగుతున్న అనేక విషయాలకు సరైన సమాచారాన్ని అధికారులు అందించడం లేదని, మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారని పవన్ విమర్శించారు. వారు అంతగా ఏం దాచాలనుకుంటున్నారో అర్థం కావట్లేదంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.
‘‘గత ప్రభుత్వానికి సంబంధి సభ్యులు అడిగే ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదు. సమాచారం అడితే అవును.. కాదు.. కుదరదు అన్న రీతిలో అధికారులు బదులిస్తున్నారు. నేతలు సమాచారం అడిగే సమగ్రంగా కాకుండా పొడిపొడిగానే బదులివ్వాలని ఏమైనా నిబంధన ఉందా. అనుబంధ పత్రాల్లోనే కాకుండా అధికారులు ఇచ్చే సమాధానాల్లో కూడా సమాచారం ఉండేలా చూడాలి’’ అని పేర్కొన్నారు పవన్(Pawan Kalyan). అదే విధంగా గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.