తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎన్నికల కదన రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. జనసేన పార్టీ అభ్యర్థులతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 23న నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కృష్ణారెడ్డితో పాటు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోనూ కమలం అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్‌గౌడ్‌కు మద్దతుగా, 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ తరపున క్యాంపెయిన్ చేయనున్నారు.
ప్రధాని మోదీ(PM Modi) పాల్గొనే బహిరంగసభలు, రోడ్ షోల్లోనూ పవన్(Pawan Kalyan) పాల్గొననున్నారు. చివర్లో పవన్ ప్రచారం తమకు మరింత ప్లస్ అవుతుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ ప్రచారం అభ్యర్థుల గెలుపునకు ఎంతవరకు ఉపయోగపడనుందో వేచి చూడాలి. కాగా బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న కమలం పార్టీకి మద్దతు ఇస్తోంది.