అతిత్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLA Quota MLC) ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు(Nagababu) కూడా తలపడనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కూటమి ఖరారు చేసింది. నాగబాబు పేరును పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫైనల్ చేశారు. ఈ మేరకు నామినేషన్ వేయాలని నాగబాబుకు సూచించారు. అయితే ఇటీవల మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే వాటిలో టీడీపీ, బీజేపీ చెరొకటి తీసుకున్నాయి. అదే సమయంలో నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబుకు కేటాయించారన్న వాదన వినిపిస్తోంది. మరి ఎన్నికల తర్వాత కూటమి ఎలాంటి గేమ్ ప్లాన్ చేస్తుందో చూడాలి.