Pawan kalyan reveals that ysr threaten him of murder: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లాలో ‘యువశక్తి’ కార్యక్రమం నిర్వహించారు. రణస్థలంలో జనసేన యువశక్తి వివేకానంద వికాస వేదిక పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ నేతలు, జనసైనికులు భారీగా చేరుకున్నారు. సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నావ్.. నేను విడాకులిచ్చే చేసుకున్నా. మీ వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడుతున్నానా అంటూ సీఎం జగన్ ని ప్రశ్నించారు. ఇది మూడు ముక్కల ప్రభుత్వం, మూడు ముక్కల ముఖ్యమంత్రి, మూడు ముక్కల ముఖ్యమంత్రికి ఢంకాపలాస్ సలహాదారుడు అంటూ జగన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మీ బెదిరింపులకు భయపడను. మీ నాన్న వైఎస్సార్ నన్ను, నా ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించారు. వాటినే ఎదుర్కొన్నాను. నువ్వొక లెక్కా అంటూ సవాల్ విసిరారు.
YSR చంపేస్తానని బెదిరించారు.. సంచలన విషయం వెల్లడించిన పవన్
-