జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం తెనాలిలో జరగాల్సిన ర్యాలీ, సభతో పాటు ఉత్తరాంధ్ర పర్యటనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
“జనసేన(Janasena) పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. కనీసం రెండు, మూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారు. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారు” అంటూ పేర్కొంది.
కాగా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటిస్తూ ప్రజలను పలకరించారు. ఈ క్రమంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.