వచ్చే ఎన్నికల్లో జనసేన(Janasena) పోటీ చేసే తొలి రెండు అసెంబ్లీ స్థానాలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్నట్టే తనకూ పార్టీ నేతల నుంచి ఒత్తిడి ఉందన్నారు. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రెండు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. మండపేట, అరుకు స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడంపై ఆయన స్పందించారు.
పొత్తు ధర్మం ప్రకారం టీడీడీ(TDP) సీట్లు ప్రకటించకూడదని.. కానీ చేశారని.. ఇందుకు పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. లోకేష్(Nara Lokesh) సీఎం పదవి గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదని.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికలలో సింగిల్‌గా పోటీ చేసి 18 లక్షల ఓట్లు సంపాదించామని.. కానీ సీట్లను పొందలేకపోయాని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా సింగిల్‌గా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయమో కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించడమే తన లక్ష్యమని పవన్(Pawan Kalyan) వెల్లడించారు.
రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తొలి 2 జనసేన పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#RepublicDay pic.twitter.com/lljIcl0dWf
— JanaSena Party (@JanaSenaParty) January 26, 2024