అన్నవరంలో పవన్ ప్రత్యేక పూజలు.. కాసేపట్లో వారాహి యాత్ర

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(Varahi Yatra) గోదావరి జిల్లాల్లో కాసేపట్లో మొదలుకానుంది. ఈ క్రమంలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చిన పవన్.. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరిగి గెస్ట్ హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.సాయంత్రం కత్తిపూడిలో నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. మొత్తం 11 నియోజకవర్గాల్లో సభలు జరుగనున్నాయి. 16న పిఠాపురం, 18న కాకినాడ, 20న ముమ్మిడివరం, 21న అమలాపురం, 22న పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో సభలు నిర్వహించనున్నారు. 27న నరసాపురంలో యాత్ర జరుగనుంది. అనంతరం పశ్చిమగోదావరి జిల్లాల్లో కొనసాగనుంది. ఈ మేరకు జనసేన(Janasena) నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి వారాహి యాత్రతో పవన్ కల్యాణ్(Pawan Kalyan) వైసీపీ ప్రభుత్వంపై శంఖారావం పూరించనున్నారు.

Read Also:
1. అనకాపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్లు రద్దు
2. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘OG’ అప్‌డేట్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...