Pawan kalyan Vizianagaram Tour Updates: జనసేనని పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో నోవాటల్ నుంచి విజయనగరం బయలుదేరనున్నారు. విజయనగరం జిల్లాలోని గుంకలాంలో జగనన్న కాలనీల్లో నిర్మితమవుతున్న గృహ నిర్మాణాలను పరిశీలించనున్నారు. పవన్ విశాఖ నుంచి రోడ్డు మార్గంలో రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకోంటారు.
పవన్ కళ్యాణ్ విజయనగరం పర్యటనపై కూడా బొత్స సత్యనారయణ స్పందించారు. జగనన్న కాలనీలు చూసేందుకు పవన్ వెళ్తారట. వెళ్లండి తప్పులేదని.. విజయనగరం జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద లే అవుట్ ఎక్కడా లేదన్నారు. సుమారు 400 ఎకరాల్లో 12 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, అక్కడ ఊరు నిర్మిస్తున్నామని, పూర్తి కావడానికి నాలుగేళ్లు అవుతుందని పేర్కొన్నారు. పవన్ అక్కడ ఏదో అన్యాక్రాంతం అవుతున్నట్లు రాద్దాంతం చేయడం సరికాదన్నారు. పవన్ జతకట్టిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే..