జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీ సీఎం జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖలో జగదాంబ సెంటర్ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. సీఎంపై సంచలన ఆరోపణలు చేశారు. వైజాగ్‌లో రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలు, సహజవనరులు కూడా దోచుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ గుర్తు పెట్టుకో.. కేంద్రంతో నిన్నుఓ ఆట ఆడిస్తా చూడు అంటూ వార్నింగ్ ఇచ్చారు. జగన్ అనే వాడు నాయకుడు కాదు.. వ్యాపారి అంటూ పరుష పదజాలంతో విమర్శించారు. ఇక్కడ దోపిడీ చేస్తున్న వైసీసీ ఎమ్మెల్యేలు అందరి జాతకాలు కేంద్రం వద్ద ఉన్నాయని హెచ్చరించారు.
సుస్వాగతం సినిమా కోసం గతంలో జగదాంబ సెంటర్(Jagadamba Centre) వచ్చానని.. మళ్లీ వారాహి వాహనం ఎక్కి ఈ సెంటర్‌కు విచ్చేశానని తెలిపారు. తనలో ఉన్న సిగ్గు భయం పోగొట్టి నటన నేర్పి అన్నం పెట్టింది విశాఖ నగరమని తెలిపారు. సీఎం జగన్‌తో సహా ఎవరికీ మీరు భయపడవద్దని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఓడిపోయి మంగళగిరి(Mangalagiri) కార్యాలయంలో బాధలో కూర్చుని ఉన్నప్పుడు విశాఖ నాకు ధైర్యం ఇచ్చిందన్నారు. ప్రశాంతమైన విశాఖలో ప్రస్తుతం గుండాలు రాజ్యమేలుతున్నారని.. అలాంటి గుండాలు నుంచి రక్షించాడానికి ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడని భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లాను వైసీపీ విముక్త ప్రాంతంగా చేస్తామని.. చొక్కాలు పట్టుకుని నిలదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. జగన్(YS Jagan) పదే పదే తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని.. మీరు తనను వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేసినా భయపడే వ్యక్తిని కాదన్నారు.
గాజువాకలో ఓడిపోయినప్పుడు అంతగా బాధవేయలేదని.. కానీ రాష్ట్రాన్ని దోచుకునే వాడికి అధికారం ఇచ్చారని ఆవేదన చెందానని తెలిపారు. అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం జగన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ బ్యాచ్ తెలంగాణలో భూములు దోచుకోవడంతో అక్కడ నుంచి తరిమేశారన్నారు పవన్(Pawan Kalyan). వైసీపీని ఆంధ్ర నుంచి తరమికొట్టే దాకా తన పోరాటం ఆగదని జనసేనానని వెల్లడించారు. రాష్ట్రంలో 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని చెబితే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ గూండాలు, చిత్తూరు ఎస్పీ తను విమర్శించారన్నారు. కానీ పార్లమెంటులో కేంద్ర హోంశాఖ ప్రకటించిన దాంతో ఎక్కువగానే మిస్సింగ్ లు ఉన్నాయని తేలింది. తాను ఏది అవగాహన లేకుండా మాట్లాడాను అని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.