జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV) మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. పవన్ కల్యాణ్‌కు తనపైనే నమ్మకం లేదని ఆర్జీవీ విమర్శించారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. స్క్రీన్ మీద చేసేదే బయట చేస్తున్నాడని విమర్శించాడు. సినిమాల్లో నటించే హీరో బయట ఎప్పటికీ హీరో కాలేడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారైనా ప్రజలు తనపై జాలి చూపిస్తారని భావిస్తున్నాడు. వాలంటీర్లు ప్రజలను భయపెట్టి డేటా తీసుకోలేదు. ప్రజలు ఇష్టపప్రకారమే డేటా ఇచ్చారు అని రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు.