Pawan kalyan’s varahi vehicle gets all permissions: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. అన్ని అనుమతులు ఉన్నందునే వారం కిందటే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనానికి TS 13 EX 8384 నంబర్ ను కూడా కేటాయించారు. ఈ వాహనం ఆర్మీ కలర్ ను పోలి ఉన్నది వాస్తవమే కానీ వారాహికి ఉన్న కలర్ ఎమరాల్డ్ గ్రీన్ అని, ఆలివ్ గ్రీన్ కి ఎమరాల్డ్ గ్రీన్ కు కాస్త సిమిలారిటీ ఉంటుందని.. అయినప్పటికీ అవి రెండు ఒకటి కాదని, వాహనానికి సంబందించిన సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం రవాణా శాఖ అధికారులు స్పష్టం చేసారు.
పవన్ కళ్యాణ్ ఈ నెల 7న వారాహి(Varahi) వాహనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆర్మీ అధికారులు ఉపయోగించే కలర్ ఉండడంతో మండిపడ్డారు. రవాణాశాఖ నిబంధనల ప్రకారం అనుమతులు రావంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Read Also: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మరోసారి తాత కాబోతున్న చిరు