సినిమాలను, రాజకీయాలను వేరు వేరుగా చూడాలని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దలు ప్రజల అవసరాల గురంచి ఆలోచించాలని, పెద్ద పెద్ద సమస్యలపై దృష్టి పెట్టాలని, సినిమా కలెక్షన్లు, హీరోల రెమ్యూనరేషన్ల గురించి వదిలేయాలని కోరారు.
తాజాగా.. చిరంజీవి(Chiranjeevi) వ్యాఖ్యలపై పేర్ని నాని(Perni Nani) కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి, ఆయన బంధువులపై తాము మాట్లాడలేదని అన్నారు. కథతో సంబంధం లేకుండా ఒక మంత్రి గురించి పాత్ర సృష్టించారని తెలిపారు. గిల్లితే గల్లించుకోవాలని సినిమాలో చెప్పినట్లుకాదని, బాహ్య ప్రపంచంలో గిల్లితే తిరిగి గిల్లుతారని అన్నారు. ఒక రాష్ట్ర మంత్రిపై పాత్ర సృష్టిస్తే.. మాట్లాడొద్దా అని అడిగారు.