PM Modi: కందుకూరు దుర్ఘటనపై మోడీ దిగ్భ్రాంతి.. బాధితులకు ఆర్థిక సాయం

-

PM Modi Expresses Regret Over Kandukur Incident and announces ex-gratia to kin of deceased: నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్డు షో లో జరిగిన దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని ప్రధాని తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేస్తామని ప్రకటించారు.

- Advertisement -

మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా బుధవారం రాత్రి కందుకూర్ లో చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చంద్రబాబు రోడ్ షో కి భారీగా జనం తరలివచ్చారు. బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా జనం కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో కొంతమంది టిడిపి కార్యకర్తలు పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయారు. దీంతో ఊపిరాడక ఎనిమిది మంది కార్యకర్తలు ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు రూ.15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే వారి కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా వారిని చదివిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Read Also: అప్పుడు 29.. ఇప్పుడు 8.. బాబు పై కేసు పెట్టాల్సిందే!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...