తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన మోదీకి అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం బంగారు వాకిలి మీదుగా ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపం వద్ద మోదీకి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ జీయర్‌లు శ్రీవారి శేష వస్త్రంతో మోదీని సత్కరించారు. దర్శనానంతరం వకులామాత, విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు.
ప్రధాని పర్యటన కారణంగా కేంద్ర బలగాల నిఘాలో తిరుమల(Tirumala) వెళ్లిపోయింది. ప్రధాని వెళ్లే మార్గాలలో దుకాణాలను మూయించారు. గతంలో 2015, 2017, 2019 సంవత్సరాల్లో ప్రధాని(PM Modi) హోదాలో స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. మళ్లీ ఇప్పుడు స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల()లో శ్రీవారిని దర్శించుకున్నానని ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ఫొటోలను పోస్ట్ చేశారు. 140కోట్ల మంది భారతీయులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని వేంకటేశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు.