గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం(Guntur Tahsildar Office) చెత్తకుప్పలో దస్త్రాలు లభించిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం జరిగిన కొన్ని రోజులకే చెత్తకుప్పలో దస్త్రాలు లభించడం తీవ్ర చర్చలకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. దీంతో పోలీసులు దీనిపై దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
Guntur Tahsildar Office | గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ వెనక ఉన్న తహసీల్దారు కార్యాలయం ప్రధాన గేటు దగ్గర చెత్తకుప్పలో దస్త్రాలు పడేసి ఉన్నాయని ఓ వ్యక్తి సోసల్ మీడియాలో వీడియో పెట్టడం జరిగిందని, అందులో అటువంటిదేమీ లేదని పోలీసులు తేల్చారు. అవి కేవలం చిత్తు కాగితాలేనని పోలీసులు నిర్దారించారు. చెత్తకుప్పలో దస్త్రాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న వెంటనే గుంటూరు పశ్చిమ తహసీల్దారు ఫణీంద్రబాబు హుటాహుటిన అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. కానీ అక్కడ దస్త్రాల వంటివి ఏమీ కనిపించకపోవడంతో కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భావించారు. కాగా వారు ఎవరు అనే విషయం తెలియలేదని, వారిని గుర్తించడానికి ఉన్నతాధికారులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా పాపేపర్లను స్వీపర్.. కాగితాల దుకాణంలో విక్రయించాడని, ఆ సమయంలోనే గుర్తుతెలియని వ్యక్తి దీనిని వీడియో తీసి పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి అసత్య ప్రచారం చేసిన వారిని త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు వివరించారు.