New Year Celebrations | న్యూ ఇయర్ వేడుకలకి తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఇవాళ రాత్రి నుంచే సెలబ్రేషన్స్ మొదలవునున్నాయి. ఇప్పటికే అందరూ ఎంజాయ్ మెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఇదే సమయంలో పోలీసులు కూడా నిఘా పెంచారు. వేడుకల పేరుతో గీత దాటొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
డ్రగ్స్, గంజాయి, ఫామ్ హౌస్ పార్టీలు, రేవ్ పార్టీలపై డేగ వేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లు చేపడుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్, ఫామ్ హౌస్ లపై ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమతులు లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీలో డ్రగ్స్ దొరికితే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
New Year Celebrations | ఇక హైదరాబాద్ లో ఈరోజు రాత్రి 10 నుంచే ఫ్లై ఓవర్లు మూసివేస్తున్నారు. రోడ్ల పక్కన సంబరాల పేరుతో ఓవరాక్షన్ చేస్తే తాటతీస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఇప్పటికే పలు పబ్లపై నిషేధం విధించారు. తాగి వాహనాలు నడిపితే యాక్షన్ సీరియస్ గా ఉంటుందని తేల్చి చెప్పారు.