జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్(Pothina Mahesh) వైసీపీలో చేరారు. విజయవాడ నుంచి తను అనుచరులతో ర్యాలీగా గుంటూరు జిల్లాలోని సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రం క్యాంప్ దగ్గరికి వెళ్లారు. అనంతరం జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహేశ్‌తో పాటు కొంతమంది అనుచరులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మహేశ్‌కు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పాల్గొన్నారు.
రెండు రోజుల క్రితం పోతిన మహేశ్(Pothina Mahesh) జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి జనసేన టికెట్లు అమ్ముకున్నారని.. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తన స్వార్థ రాజకీయాల కోసం కాపు యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎందుకు సీట్లు కేటాయించలేదని.. టీడీపీ వారికే సీట్లు ఎందుకు ఇచ్చారు? అని నిలదీశారు. అయితే పోతిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వైసీపీకి అమ్ముడుపోయి పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. కాగా పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీజేపీకి వెళ్లడంతో అక్కడ నుంచి సుజనాచౌదరి పోటీ చేస్తున్నారు.