ఏపీకి తీసుకురాలేని ప్రత్యేక హోదా బాబాయ్‌కు మాత్రం ఇప్పించారు: RRR

Raghurama Krishnam Raju

ఏపీ సీఎం జగన్ పై మరోసారి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghurama Krishnam Raju) వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయిన జగన్ తన బాబాయ్‌ వై.ఎస్ భాస్కర్ రెడ్డికి మాత్రం జైల్లో ప్రత్యేక హోదాతో కూడిన సౌకర్యాలు వచ్చేలా చేశారని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ పెద్దలను ఆయన ఒప్పించగలిగారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే జగన్‌కు ప్రజాకోర్టులో మాత్రం న్యాయమూర్తులైన ప్రజలు ఇచ్చే తీర్పు త్వరలోనే వస్తుందన్నారు.

అలాగే నిబంధనలు అతిక్రమిస్తూ కేంద్ర సర్వీసుల్లోని జూనియర్ అధికారులను రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి జగన్ కీలక బాధ్యతలు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఐఏఎస్ అధికారులకు ఇవ్వాల్సిన టీటీడీ ఈవో పోస్ట్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ధర్మారెడ్డికి ఇచ్చారని గుర్తు చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈసారి కూడా భీమవరం నుంచి పోటీచేయాలని కోరుతున్నట్టు చెప్పారు. మంచి మనిషిని ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని.. అందుకే ఈ దఫా ఆయనను 60 వేలకు పైగా మెజారిటీతో గెలిపించాలని భావిస్తున్నారని RRR(Raghurama Krishnam Raju) ధీమా వ్యక్తం చేశారు.

Read Also:
1. అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here