చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి స్టేషన్ కు రాగానే బీ-5బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పొగలు రావడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును ఆపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రేకుల్లో సమస్య తలెత్తడం వల్లే పొగలు వ్యాపించాయని గుర్తించిన సిబ్బంది వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టారు. సుమారు కావలి స్టేషన్ లో 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం కావలి నుంచి రైలు బయలుదేరి వెళ్లింది.
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు
-