ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో విచారణ జరిపిన సిబిఐ కోర్టు చంద్రబాబు నాయుడుకి 22వ తారీకు వరకు రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడంపై టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నారు. వైసిపి ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిందని ఆరోపిస్తున్నారు. రాక్షసానందం కోసమే చంద్రబాబును జైలుకు పంపించే కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసును మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ స్టేట్మెంట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడుని అరెస్టు(Chandrababu Arrest) చేశారు అనడంపై రమేష్ స్పందించారు. పీవీ రమేష్(PV Ramesh) చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు(Skill Development Case)లో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు పీవీ. చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ.. ఈ కేసులో సిబిఐ అధికారులు ప్రవర్తించిన తీరు అనుమానం కలిగించేలా ఉందని పీవీ రమేష్ అన్నారు. నా స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరం కలిగించిందని వ్యక్తం చేశారు. నా వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్(Chandrababu Arrest) చేశారనటం హాస్యాస్పదంగా ఉందన్నారు పీవీ రమేష్. నేను అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవం అని స్పష్టం చేశారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు? అంటూ ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‍మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పు చేయలేదు అని తెలిపారు.
సీఐడీ(CID) తీరుపై నాకు అనుమానం కలుగుతోంది అని రమేష్ వెల్లడించారు. నేను చెప్పింది సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానం అన్నారు. నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో లేవు అని తెలిపారు. స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానం.. మరి వారి పేర్లు ఎందుకు లేవు? అని నిలదీశారు విశ్రాంత IAS అధికారి పీవీ రమేశ్.