ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) మరో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు(Chandrababu), పవన్‌పై అసభ్యకర పోస్ట్‌లు పెట్టారన్న అంశంపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని నోటీసులు కూడా ఇచ్చారు. కానీ పోలీసుల విచారణకు ఆర్‌జీవీ గైర్హాజరయ్యారు. అంతేకాకుండా బిజీ షెడ్యూల్ కారణంగానే తాను విచారణకు రాలేకపోయానని, తనకు నాలుగు రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ ఒంగోలు(Ongole) రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ బాబుకు వాట్సప్‌లో మెసేజ్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
తానెవరి పరువుకు నష్టం కలిగించే విధంగా పోస్ట్‌లు పెట్టలేదని, అదే విధంగా ఇరు వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా కూడా పోస్టులు చేయలేదని ఆర్‌జీవీ(RGV) తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని, కావున తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రామ్ గోపాల్ వర్మ తన పిటిషన్‌లో వివరించారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్, లోకేష్‌లను ఉద్దేశించి ఆర్‌జీవీ అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారంటే టీడీపీ కార్యదర్శి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.