RGV Meets AP CM YS Jagan: వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ మరోసారి రాజకీయ ప్రకంపనలకు తెరలేపారు. బుధవారం ఆయన ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ సీఎంతో భేటీ అవనున్నారనే విషయం వారు కలిసేంతవరకు కూడా ఎక్కడా చిన్న లీక్ కూడా లేదు. అయితే వీరి భేటీపై అటు రాజకీయం గానూ, సినిమా ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది.
మెగా ఫ్యామిలీపై సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ఆర్జీవీ. ఇక వైసీపీ కి సైతం జనసేనాని బద్దశత్రువే. ఈ తరుణంలో వీరిద్దరి కలయిక పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా సినిమా తీసే అంశంపైనే అని ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి టీడీపీ(TDP)కి కొంత డ్యామేజ్ క్రియేట్ చేయడంలో ఆర్జీవీ సక్సెస్ అయిన మాట వాస్తవం. ఇక ఈసారి కూడా టీడీపీ ని దెబ్బకొట్టే సినిమా రచన కోసమే గుసగుసలు జోరందుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఆర్జీవీ(RGV) చేసిన ట్వీట్స్ రాజకీయ సంచలనానికి దారి తీశాయి. అతి త్వరలో రాజకీయ నేపథ్యంలో సినిమా తీయబోతున్నాను అంటూ ఆయన చేసిన ట్వీట్స్ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. “వ్యూహం” అనే రాజకీయ సినిమా తీయబోతున్నాను. ఇది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా రియల్ పిక్ అంటూ ఆయన చేసిన వరుస ట్వీట్స్ ఇప్పుడు ఫిల్మ్, పొలిటికల్ ఇండస్ట్రీస్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన చేసిన ట్వీట్స్ లింక్స్ కింద ఉన్నాయి, చూడవచ్చు.
Read Also: నాన్న కోసం అమ్మ అలా చేసింది
నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.
బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .
రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” ,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .
ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022