RGV about Pawan Kalyan: కాపులను అమ్మేశాడంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు

-

RGV about Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో సమావేశమైన వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. వీరి భేటీ పై పలు రాజకీయ ఊహాగానాలు లేవనెత్తాయి. పొత్తు పై చర్చించేందుకే చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా వీరి కలయికపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీ పై ఒంటికాలతో లేచే వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ డబ్బు కోసం కాపులను కమ్మోళ్ళకి అమ్మేశాడంటూ రాజకీయ సంచలనానికి తెరలేపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. “కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని(RGV about Pawan Kalyan) ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు ???” అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు వర్మ. ఆయన చేసిన ఈ పోస్ట్ పై జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ram Mohan Naidu | ఆ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. ఎంపీ రామ్మోహన్ నాయుడి వార్నింగ్

తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(Ram...

న్యూ ఇయర్ వేడుకలు.. గీత దాటితే తాట తీస్తామంటోన్న పోలీసులు

New Year Celebrations | న్యూ ఇయర్ వేడుకలకి తెలుగు రాష్ట్రాలు...