Sajjala Ramakrishna Reddy comments on Andhra Pradesh: సుప్రీం కోర్ట్ లో ఉన్న రాష్ట్ర విభజన కేసు పై ఉండవల్లి చేసిన కామెంట్స్ పై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తెలుగు రాష్ట్రాల విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర విభజనను మొదటినుండి వైసీపీ వ్యతిరేకిస్తోందని, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంగా చేస్తే ముందుగా స్వాగతించేది వైసీపీ నే అని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై కోర్టులో కేసులు వేశామని, తమ వాదన బలంగా వినిపిస్తామని సజ్జల అన్నారు. ఏ అవకాశం వచ్చిన ఉమ్మడిగానే ఉండాలని కోరతామని లేదంటే విభజనను సరిదిద్దాలని కోరతామని అన్నారు. ఆనాడు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని సజ్జల వ్యాఖ్యానించారు.
Sajjala Ramakrishna Reddy: వైసీపీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నే కోరుకుంటుంది!
-