Sankranthi Holidays List In AP: ఏపీలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. కొత్త సంవత్సరం వస్తుందంటే సంక్రాంతి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్న వారంతా సంక్రాంతి వచ్చిందంటే తన సొంతోళ్ళకు వెళ్లాలని ముందే ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక స్కూళ్ళకి కాలేజీలకి వెళ్లే విద్యార్థులు మాత్రం సంక్రాంతి సెలవుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఏపీ సర్కార్. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండనున్నాయి. జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుండి 17 వరకు సెలవులు ఉంటాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
విద్యార్థులకు గుడ్ న్యూస్.. AP లో సంక్రాంతి హాలిడేస్ లిస్ట్ ఇదే
-