Ambati Rambabu | అంబటికి గట్టి షాక్.. టికెట్ ఇవ్వొద్దని తీర్మానం

-

మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు గట్టి షాక్ తగిలింది. సొంత నేతల నుండి అసమ్మతి స్వరం వినిపిస్తోంది. టికెట్ ఇవ్వొద్దు అంటూ డిమాండ్ మొదలైంది. టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో అంబటి వ్యతిరేక వర్గం నాయకులు సమావేశం అయ్యారు. ఈ భేటీలో అసమ్మతి నాయకులు వెంకటేశ్వర రెడ్డి మద్దతు కోరారు.

- Advertisement -

అంబటి రాంబాబు సత్తెనపల్లి(Sattenapalli) లో క్యాడర్ ని పట్టించుకోవట్లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అంబటి ఇబ్బందులు పెట్టారని వాపోయారు. సత్తెనపల్లి టికెట్ స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు(Ambati Rambabu) స్తెప్పులేసి సంబరాల రాంబాబులా మారిపోయారని, ఆయన చర్యలు పార్టీని దిగజార్చేవిగా ఉన్నాయని మండిపడ్డారు. అధిష్టానం ఆయనకి టికెట్ ఇవ్వకూడదు అంటూ తీర్మానం చేశారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జగన్(YS Jagan) ఆదేశిస్తే పోటీ చేయడానికి రెడీ అని యర్రం వెంకటేశ్వర రెడ్డి(Yarram Venkateswara Reddy) స్పష్టం చేశారు.

Read Also: గిడుగు రాజీనామా.. వైఎస్ షర్మిలకి రూట్ క్లియర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kartik Aaryan | ‘మద్దతు లేదు.. నాది ఒంటరి పోరాటమే’

ఇండస్ట్రీలో తాను చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నానని చెప్పాడు బాలీవుడ్ యంగ్ హీరో...

White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..

తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...