Gudivada Engineering College | కృష్ణాజిల్లా గుడివాడ మండలంలోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంపై అర్థరాత్రి 3 గంటల వరకు కూడా విద్యార్థినిలు ఆందోళన తెలియజేశారు. సీక్రెట్ కెమెరా గురించి యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టలేదని, తమకు న్యాయం జరిగే వరకు వెనక్కు తగ్గమంటూ పోరుబాట పట్టారు. వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి రికార్డ్ చేసిన వీడియోలను వారు అమ్ముకున్నారని కూడా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కాగా సీక్రెట్ కెమెరాను ఓ విద్యార్థిని సహాయంతోనే ఫైనల్ ఇయర్‌కు చెందిన విజయ్ అనే విద్యార్థి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Gudivada Engineering College | ఈ సమయంలోనే పోలీసులు విజయ్‌ను అక్కడకు తీసుకురావడంతో విద్యార్థినులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీంతో వెంటనే వారిని అడ్డుకున్న పోలీసులు విజయ్‌ని ఆసుపత్రికి తరలించారు. అతడిని అక్కడే విచారించి అతడి ఫోన్, ల్యాప్‌టాప్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేస్తున్నాని, బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలి పెట్టమని పోలీసులు తెలిపారు. అదే విధంగా ఒకవేళ వీడియోలు ఏమైనా ఉంటే అవి బయటకు రాకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని, విద్యార్థినిలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.