చంద్రబాబు సభలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి(వీడియో)

-

Seven people died in Chandrababu Naidu Sabha in Nellore: నెల్లూరులోని కందుకూరులో నిర్వహిస్తున్న చంద్రబాబు సభలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జనం భారీగా తరలి రావడంతో తొక్కిసలాట నెలకొంది. దీంతో పక్కనే ఉన్న కాలువలో పడి ఏడుగురు మృతి చెందారు. దీంతో చంద్రబాబు తన ప్రసంగం ఆపేసారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆదేశించారు.

- Advertisement -

ఆయన కాన్వాయ్ లో అంబులెన్సు ఇచ్చి పంపించారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవటానికి, చంద్రబాబు నేరుగా హాస్పిటల్ కు వెళ్లారు, అక్కడే ఉండి పరిస్థితి సమీక్షించారు. చనిపోయిన కుటుంబాలకు పార్టీ తరుపున రూ.10 లక్షలు ప్రకటించారు. అలాగే గాయపడిన వారిని ఆదుకుంటామని, వారి పిల్లలని ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లో చదివిస్తామని హామీ ఇచ్చారు. సభా ప్రాంగణంలో వారికి నివాళులు అర్పించి, మీటింగ్ రద్దు చేసారు.

కాగా మరణించిన వారు దేవినేని రవీంద్రబాబు (ఆత్మకూరు), కలవకూరి యానాది (కొండమూడుసుపాలెం), యాటగిరి విజయ (ఉలవపాడు), కాకుమాని రాజా (కందుకూరు), మరలపాటి చినకొండయ్య (గుళ్లపాలెం), పురుషోత్తం (కందుకూరు) గా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...