Missing :మూడు రోజులు దాటినా.. దొరకని ఆచూకీ

-

Missing :తమ కుమార్తె ఎక్కడ ఉందో.. ఎలా ఉందో అంటూ మూడు రోజులుగా ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించినా.. ఫలితం లేకపోవటంతో ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యం (Missing) అయ్యింది. ఉప్పత్తివారిపల్లె గ్రామానికి చెందిన గాజులపల్లె చిన్న వెంకట సుబ్బారెడ్డి, రమణమ్మ కుమార్తె వెంకట సంజన.. బద్వేల్‌ పట్టంలోని గోపిరెడ్డి స్కూలులో ఏడో తరగతి చదువుతూ, అక్కడే హాస్టల్లో ఉంటుంది. కాగా శుక్రవారం మధ్యాహ్నాం పాఠశాల నుంచి బయటకు వెళ్లిన సంజన.. స్కూల్‌కు తిరిగి వెళ్లలేదు. సాయంత్రం వరకు చూసిన పాఠశాల సిబ్బంది, సంజన తల్లికి ఫోన్‌ చేసి సమాచారం అందించారు.

- Advertisement -

బద్వేలులో ఉండే బంధువులందరికీ ఫోన్లు చేసి సంజనా ఆచూకీ గురించి వాకబు చేయగా.. ఎటువంటి సమాచారం అందలేదు. దీంతో చేసేదేమీ లేక బద్వేల్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ (Missing)‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. సంజన స్కూల్‌ నుంచి బయటకు వెళ్తున్న మార్గంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఒకచోట కనిపించింది. కానీ తరువాత నుంచి ఎటు వెళ్లిందో ఆనవాళ్లు దొరకలేదు. అటు పోలీసులు, ఇటు తల్లిదండ్రులు వెతుకతున్నా, మూడు రోజులు గడిచినా సంజనా గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. ఎవరైనా అపహరించి ఉంటారా.. లేదా తప్పిపోయిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎవరితోనైనా సంజన కుటుంబసభ్యులకు వివాదాలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...