Somu Veerraju: సీఎంకు సోము వీర్రాజు బహిరంగ లేఖ

-

Somu Veerraju: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌‌కు లేఖ రాశారు. భద్రాద్రి రాముడి ఆస్తులను మాఫియా ముఠా దురాక్రమణల నుంచి కాపాడాలంటూ లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి రాముడికి చెందిన భూములు రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్రానికి బదిలీ అయిన 7 మండలాల ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో పరిధిలోకి వచ్చాయని… కానీ జిల్లాల విభజనలో అవి శ్రీ అల్లూరి మన్యం జిల్లా, పాడేరు పరిధిలోకి వచ్చాయని తెలిపారు.

- Advertisement -

‘‘ఈ భూములపై కన్నేసిన ఒక ముఠాలోని కొందరు, భాగాలుగా ఏర్పడి మాఫియాగా మారిపోయారు. ఒక క్రైస్తవ సంస్థ ముసుగులో భూ కబ్జాకి ప్రయత్నిస్తున్నారు. ఆ భూములను వాళ్ల అధీనంలోకి తెచ్చుకున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను. వందల కోట్ల ఆస్తిని కబ్జా చేసేందుకు రంగంలోకి దిగిన ముఠా, ఎండోమెంట్ అధికారులపై కూడా దౌర్జన్యం చేసింది.

రాముడు లేడు దేవుడు లేడు. తన భూములు కావాలనుకుంటే రాముడినే వచ్చి అడగమను.. మధ్యలో మీరెవరు..? మీరు ఎందుకు వచ్చారు అంటూ ఎండోమెంట్ అధికారులను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎటపాక మండలంలో 1 నుంచి 101 సర్వే నంబర్లలో దాదాపు 980 ఎకరాల శ్రీరాముడి భూములు ఉన్నాయి. ఈ విషయాలను ఉపముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి తెచ్చాను కానీ మంత్రి పట్టించుకోలేదు.

దాదాపు 916 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ఆ దేవుడి పొలాల్లో రాబందుల్లా వాలిపోయారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. రాముడు అంటే విశ్వాసం లేని, హిందూ ధర్మం నుంచి క్రైస్తవ మతం మారిన వ్యక్తులు రాముడిని ఎగతాళి చేస్తూ.. భగవంతుడి భూములు కబ్జా చేస్తున్నారు.’’ సీఎం జగన్ వెంటనే జోక్యం చేసుకుని ఆస్తుల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని Somu Veerraju లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు

Read also: కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన ఖర్గే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...