Students Fighting: సినిమా తరహాలో కొట్టుకున్న కాలేజీ..సీనియర్లు, జూనియర్లు

Students Fighting

Students Fighting in Aditya engineering college at kakinada district: ల్యాబ్‌లో ప్రాక్టికల్స్‌ చేసే వస్తువులతో సీనియర్లు, జూనియర్లు విచక్షణారహితంగా కొట్టుకున్నారు. సీనియర్లు-జూనియర్లు మధ్య జరుగుతున్న వార్‌ నడుస్తున్న నేపథ్యంలో.. వివాదం కాస్తా ముదురి కొట్టుకునే వరకు వచ్చింది. ఇదంతా ఏదో సినిమాలో జరిగిందని అనుకుంటే పొరపాటే, నిజజీవితంలోనే.. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో జరిగింది. గత కొన్ని రోజులుగా కాలేజీలోని సీనియర్లు, జూనియర్ల మధ్య వివాదం నడుస్తోంది. అది కాస్తా ముదరటంతో.. సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు.. ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌పై దాడికి దిగారు.

ల్యాబ్‌లో ప్రాక్టికల్స్‌ చేసే వస్తువులతో కొట్టుకోవటంతో.. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కాగా, గాయపడిన విద్యార్థులు సాయి తేజ, సాయిగా గుర్తించారు. దాడి చేసిన వారు సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు నాగేంద్ర, సందీప్‌గా చెప్తున్నారు. ఘటనపై కాలేజీ యాజమాన్యం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. గత కొన్ని రోజులుగా విద్యార్థుల మధ్య ఆధిపత్య పోరుతో.. వివిధ కాలేజీల్లో ఇలా గ్రూపులుగా ఏర్పడి దాడులు (Students Fighting) చేసుకుంటున్నారు. ఇటువంటి విష సంస్కృతి వల్ల విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here