ఆంధ్రప్రప్రదేశ్ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. NGT ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఏడాది మార్చి 23 ఇసుక తవ్వకాలపై స్టే NGT స్టే విధించింది. NGT తీర్పుపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. కాగా, రాష్ట్రంలో ఇసుక వ్యాపారం ఇప్పుడు వైఎస్సార్సీపీ నేతల చేతుల్లోకి వెళ్లిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుకలో ఉపగుత్తేదారుగా ఉన్న టర్న్‌కీని వాళ్లే తీసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విమర్శలు చేస్తున్నారు.
Read Also: తీవ్ర విషాదం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat