మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) మందస్తు బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. వెకేషన్ బెంచ్ ముందు సునీతారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూధ్రా ఈ పిటిషన్ గురించి ప్రస్తావించగా.. రేపు విచారించడానికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దీంతో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అవినాశ్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ(CBI) సైతం తమ వాదనలు వినిపించనుంది. కాగా తెలంగాణ హైకోర్టు మే31న జారీ చేసిన ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వివేకా కుమార్తె సునీత మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొన్నందున బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. అవినాశ్(Avinash Reddy)పై సీబీఐ మోపిన అభియోగాలు తీవ్రమైనవి అని అయితే హైకోర్టు మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-