Viveka Murder Case | వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి నోటీసులు..

-

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ నేత అవినాష్ రెడ్డి(Avinash Reddy)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అప్రూవర్ శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డిని బెదిరించినట్లు వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టులో వెల్లడించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఇందులో భాగంగానే అప్రూవర్ శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.

- Advertisement -

దీంతో పాటుగా తమపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా ఈరోజు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు(Viveka Murder Case) పరిణామాలను లూథ్రా.. సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read Also: కాగ్ అధిపతిగా తెలుగు అధికారి.. ఎవరంటే..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...