టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) సూపరింటెండెంట్ గా ప్రభావతి(Superintendent Prabhavathi) దర్యాప్తుకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరుకావాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
కాగా, గతంలో ప్రభావతికి జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం మధ్యంతర ఉపశమనం కల్పించింది. అయితే దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు చెప్పినా దర్యాప్తుకు సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో నేడు RRR కస్టోడియల్ టార్చర్ కేసు(RRR Custodial Case) విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దర్యాప్తుకి సహకరించకపోతే మధ్యంతర ఉపశమనం రద్దు అవుతుందని హెచ్చరించింది. తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా వేసింది.