Tammineni Sitaram comments about supreme court verdict: ఏపీ మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై తమ్మినేని సీతారాం స్పందించారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న సమయంలో న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా తీర్పు వచ్చిందని అన్నారు. రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. మూడు రాజధానుల కేసులో హైకోర్టు ఓవర్ ల్యాప్ అయ్యిందన్నారు. ప్రభుత్వ విధులను హైకోర్టు చేస్తుందని అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. ‘‘ఆరుమాసాలలో ఒక ఇల్లు కూడా కట్టలేం రాజధాని ఎలా కడతాం’’ అని ప్రశ్నించారు. వికేంద్రీకరణపై యాగీ చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. రాజధాని కోసం రైతుల పేరుతో బినామీ యాత్రలు చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవిధంగా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుది పొలిటికల్ డ్రమిటిక్ షో అని స్పీకర్ తమ్మినేని అపహాస్యం చేశారు.