Tamoto: కిలో రూపాయి.. కుదేలవుతున్న రైతు!

-

Tamoto and onion price down at kurnool district: కనీసం పెట్టిన పెట్టుబడి రావటం లేదంటూ టమోటా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కర్నూలు జిల్లా పత్తికొండలో టమోటా ధరలు అత్యంత దారుణంగా పడిపోయాయి. కిలో టమోటా రూపాయి పలకటంతో.. రైతులు కుదేలవుతున్నారు. కనీసం పొలం నుంచి మార్కెట్‌ తీసుకువచ్చిన రవాణా ఛార్జీలు కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 కిలోల చొప్పున 15 గంటల టమోటాలను(Tamoto) పత్తికొండ మార్కెట్‌కు తీసుకువస్తే.. కమీషన్‌ పోగా రైతులకు మిగిలింది కేవలం రూపాయి అని రైతులు తలలుపట్టుకుంటున్నారు.

- Advertisement -

తమ దగ్గర అతి తక్కువ ధరకు టమోటాను కొనుగోలు చేసి, బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇస్తామని చెప్పిన మాటలు హామీలుగానే మిగిలిపోయాయనీ.. తమను పట్టించుకునే నాథుడే లేడంటూ రైతు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు కల్పించుకొని, మద్దతు ధర ప్రకటించే విధంగా చూడాలని వేడుకుంటున్నారు. అటు ఉల్లి రైతుల పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో కిలో ఉల్లి రూ. 6 నుంచి రూ.8 మాత్రమే పలుకుతుందని వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...