ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అంజనీ కుమార్‌ను వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అంజనీకుమార్‌ను(Anjani Kumar) రిలీవ్ చేస్తూ తెంలగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్రం చెప్పిన అభిలాష బిస్తీ(Abhilash Bisht), అభిషేక్ మహంతీలలో.. బిస్తీని కూడా రిలీవ్ చేసింది తెలంగాణ. అభిషేక్(Abhishek Mohanty) విషయంలో మాత్రం ఇంకా సందిగ్దత కొనసాగుతోంది.
కరీనంగర్ కమిషనర్ గా ఉన్న మహంతిని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఆయనను రిలీవ్ చేయాల్సిన అంశాన్ని కేంద్రం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. దీంతో ఆయనను రిలీవ్ చేసే అంశం ఇంకా తేలలేదు. కాగా రిలీవ్ లెటర్స్ అందుకున్న అంజనీ కుమార్(Anjani Kumar), అభిలాష.. ఇప్పుడు ఏపీ కేడర్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంది.