National Panchayat Awards |జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రం అత్యధిక అవార్డులు గెలుచుకుంది. మొత్తం 27 అవార్డుల్లో 8 కైవసం చేసుకుని శభాష్ అనిపించుకుంది. కాగా పొరుగు రాష్ట్రమైన ఏపీకి ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం విశేషం.
National Panchayat Awards |ఏయే విభాగాల్లో ఏ పంచాయతీలకు అవార్డ్స్ దక్కాయంటే…
ఆరోగ్య పంచాయితీ విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గౌతమ్ పూర్.
తగినంత నీరు కలిగిన గ్రామ పంచాయితీ విభాగంలో మొదటి స్థానంలో జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామ పంచాయతీ.
సామాజిక భద్రత విభాగంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొంగట్ పల్లి కి మొదటి స్థానం.
మహిళా స్నేహపూర్వక విభాగంలో సూర్యాపేట జిల్లాలోని ఐపూర్ కు మొదటి స్థానం.
పేదరికం లేని, మెరుగైన జీవనోపాధి పంచాయితీ విభాగంలో జోగులాంబ గద్వాల్ జిల్లా మండొడ్డి గ్రామ పంచాయతీకి రెండో స్థానం.
పంచాయితీ విత్ గుడ్ గవర్నెన్స్ విభాగంలో వికారాబాద్ జిల్లా చీమల్దారి గ్రామ పంచాయతీకి రెండో స్థానం.
పచ్చదనం, పరిశుభ్రత విభాగంలో పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పురికి మూడో స్థానం.
స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామ పంచాయతీకి మూడో స్థానం.
Read Also: రాసలీలల వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Follow us on: Google News, Koo, Twitter