Temple: నరసింహ స్వామి ఆలయంలో నాలుగు హుండీల చోరీ

0
Narasimha Swamy Temple

Temple hundis theft in Narasimha Swamy Temple: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. కొందరు దొంగలు తూర్పుగోదావరి ఆలయాలను టార్గెట్ చేసి హుండీలను ఎత్తుకెళుతున్నారు. ఈ క్రమంలో కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లోపలికి కొందరు దుండగులు ప్రవేశించి నాలుగు హుండీలను పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. గోడకి ఉన్న రెండు డిబ్బిలను, రెండు స్టీల్ హుండీలు బద్దలు కొట్టి నగదు దొంగిలించుకుపోయారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడంతో దొంగలు దర్జాగా హుండీ లను దోచుకొని పోయినట్లు తెలుస్తుంది. కాగా.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని, పగలగొట్టిన లాకర్లను పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here