ఎన్నికల వేళ వైసీపీ(YCP)కి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీలో భారీ కుదుపు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా కాకినాడ(Kakinada) జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు(Jyothula Chantibabu) టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల 5 లేదా 6న పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు(Pendem Dorababu) కూడా జనసేన(Janasena) పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో ఉంటూ జనసేన పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్(Parvata Prasad) సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారట. మొత్తానికి సీట్ల మార్పు అంశం వైసీపీలో పెద్ద దుమారమే రేపుతోంది.