మంత్రి రోజా(Minister Roja) ప్రతినెల తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నేడు శ్రీవారి దర్శనానికి వెళ్ళారు రోజా. దర్శనానంతరం బయటకి వచ్చిన రోజాకి ఊహించని పరిణామం ఎదురైంది. ఫొటోల కోసం ఆమె చుట్టూ చేరిన శ్రీవారి సేవకులు అమరావతి నినాదాలతో షాక్ ఇచ్చారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అంటూ గట్టి గట్టిగా నినాదాలు చేశారు. వారు అంతటితో ఆగలేదు. మంత్రి రోజాని కూడా జై అమరావతి(Jai Amaravati) అనాలని కోరారు. ఆమెని జై అమరావతి అనాలంటూ వెంబడించారు. దీంతో మంత్రికి ఏం చేయాలో తెలియలేదు. శ్రీవారి సేవకు వచ్చి ఇదేమిటంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
కాగా, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని వికేంద్రీకరణ ప్రకటనతో అమరావతి రైతులు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ప్రతిధ్వని నిరసనలు జరిగాయి. పురుగుమందుల డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నవారు ఇప్పటికే అమరావతి నుంచి సచివాలయం, హైకోర్టును తరలించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం యొక్క మొత్తం పరిపాలన ఎక్కడ ఉందో అక్కడే ఉండాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతుల నిరసనలు ప్రారంభమై 1000 రోజులు పూర్తయినా, కేంద్రం కూడా రాజధానిగా అమరావతినే గుర్తించినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల అంశానికే కట్టుబడి ఉండటాన్ని అమరావతి రైతులు తప్పుబడుతున్నారు.
తిరుపతిలో రోజా కు షాక్….
జై అమరావతి జై జై అమరావతి అంటూ నినాదాలు…. pic.twitter.com/9JEzNgUpfF
— Team Lokesh (@Srinu_LokeshIst) February 2, 2024