వేసవి సెలవులు కావడంతో తిరుమల(Tirumala) కొండకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారుల బృందం ఏర్పాటు చేయడంతో గంటన్నరం సమయం ఆదా అయింది. ఆ సమయాన్ని భక్తుల సర్వదర్శనం కోసం టీటీడీ కేటాయించింది. దీంతో శుక్రవారం రికార్డుస్థాయిలో 80వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు దర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలోనూ భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి(Sarva Darshan) 18 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న ఏడుకొండల వాడిని 81,833 మంది భక్తులు దర్శించుకోగా.. 33,860 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు వచ్చినట్లు అధికారలు తెలిపారు.
Read Also: నా తండ్రి చెప్పిన ఆ మూడు సూత్రాలను ఇప్పటికీ పాటిస్తున్నా: మంత్రి
Follow us on: Google News, Koo, Twitter