ఏపీలోని అనకాపల్లి(Anakapalli) జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇవాళ తెల్లవారుజామున తాడి-అనకాపల్లి మార్గంలో బొగ్గు లోడ్‌తో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ తో పాటు రత్నాచల్–ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖపట్నానికి వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రేపు కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా నడుస్తోందని పేర్కొన్నారు. మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులను శరవేగంగా చేస్తున్నారు.
Anakapalli | అనకాపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్లు రద్దు
-