TTD | తిరుపతి లడ్డూ ప్రసాదంపై కొన్ని రోజులుగా ప్రచారమవుతున్న వార్తలపై టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి స్పందించారు. అలాంటి అపోహలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని భక్తులను హెచ్చరించారు. కొందరు దళారీలు తమ స్వార్థం, స్వలాభం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్య్తం చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఏమైనా మార్పులు తీసుకువస్తే తామే అధికారికంగా ప్రకటిస్తామని వివరించారు. లడ్డూ ప్రసాదం బ్లాక్ మార్కెట్, దళారులను అరికట్టడానికి తాజాగా ఒక చిన్న మార్పు చేశామని వెల్లడించారు. ఈ మార్పు ద్వారా లడ్డూ ప్రసాదం బ్లాక్ మార్కెట్ విక్రయాన్ని నియంత్రించగలుగుతామని చెప్పుకొచ్చారు.
TTD | దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో లడ్డూ ప్రసాదం విక్రయిస్తామని చెప్పారు. ప్రతి భక్తునికి ఆధార నమోదుతో రెండు లడ్డూలు ఇస్తామని తెలిపారు. దర్శనం టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూలు విక్రయిస్తామని తెలిపారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగా లడ్డూ విక్రయ విధానాన్ని కొనసాగిస్తామని వివరించారు.