తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్ పెంచాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తూ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు.
ట్రయల్ రన్ లో భాగంగా సోమవారం 5వేల మసాలా వడలు(Masala Vada) సిబ్బంది భక్తులకు వడ్డించారు. ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలు తయారు చేశారు. ఈ వడలు రుచికరంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశీలనలో లోటుపాట్లను సరిచేసుకొని… పూర్తిస్థాయిలో మెనూలో మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో టీటీడీ(TTD) చైర్మన్ చేతుల మీదుగా కొత్తగా చేర్చిన వంటకంతో మెనూ ప్రారంభం కానుంది.