TTD EO ధర్మారెడ్డి ఇంట విషాదం.. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా కొడుకు మృతి

-

TTD EO Dharma reddy son chandramouli passes away due to heart attack: టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తన కుమారుడు గుండెపోటుతో మరణించడం వారి కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఇటీవలే చెన్నైకి చెందిన టిటిడి సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో ఆయనకు వివాహం ఫిక్స్ అయింది. జనవరిలో మీరు వివాహం తిరుమల లో జరిపేందుకు నిశ్చయించారు. ఇరు కుటుంబాల వారు పెళ్లి శుభలేఖలు పంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలోని తమ బంధువులకు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు స్నేహితులతో కలిసి వెళ్లారు చంద్రమౌళి. వెళ్లిన కాసేపటికి తనకు గుండె నొప్పిగా ఉందని స్నేహితులకు తెలిపారు. దీంతో వెంటనే ఆయనను చెన్నైలోనే కావేరి ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

చంద్రమౌళి హార్ట్ ఎటాక్ కి గురయ్యారని గ్రహించిన వైద్యులు ఆయనకు ఎక్మో చికిత్స అందించారు. కుమారుని పరిస్థితి తెలుసుకున్న ధర్మారెడ్డి దంపతులు హుటాహుటిన ఆసుపత్రికి తరలి వెళ్లారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రమౌళి బుధవారం తుది శ్వాస విడిచారు. నిశ్చితార్థం జరిగి పెళ్లి పనుల్లో సంతోషంగా మునిగిన తల్లిదండ్రులకు ఈ చేదు వార్త తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. పెళ్లి కుమారుడిగా చూస్తాం అనుకున్న తన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడం ధర్మ రెడ్డి(TTD EO Dharma reddy) దంపతులకు కోలుకోలేని విషాదాన్ని నింపింది. తన కుమారుడు ఇక లేడని చేదువార్తను ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ధర్మారెడ్డి కుటుంబానికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Read Also: రాజగోపాల్ అన్న తొందర పడకు!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...