Unstoppable Season 2: అన్ స్టాపబుల్ విత్ NBK కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అన్‌స్టాపబుల్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఈ రోజు సాయంత్రం 5:30కు రిలీజ్ కానున్నట్లు ఆహా టీం ప్రకటించింది. ఇక ఈ నెల 14న ఈ ఫుల్ షో స్ట్రీమింగ్ కానుంది. అయితే నందమూరి నట సింహం బాలయ్య, హోస్ట్ గా చేస్తున్న ఈ షో అన్ స్టాపబుల్ విత్ NBK మొదటి సీజన్ పెద్ద హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.. ఈ అన్‌స్టాపబుల్ 2 (Unstoppable Season 2)కు ఫ్యామిలీ అండ్ పొలిటికల్ టచ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ రానున్నారని అధికారికంగా ప్రకటించింది ఆహా టీం. అన్‌స్టాపబుల్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కోసం షో అభిమానులు రాజకీయ వర్గాలు వెయిట్ చేస్తున్నాయి.
Staying true to Debbaku thinking maaripovala, witness this sensational episode where tables turn!#UnstoppableWithNBKS2 episode 1 promo today at 5:30 PM. #NandamuriBalakrishna@ncbn @naralokesh pic.twitter.com/LokGhOQQJo
— ahavideoin (@ahavideoIN) October 11, 2022