ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి(AP New CS)గా కె విజయానంద్‌ను నియమించింది. నేడే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతమున్న నీరభ్ కుమార్ ప్రసాద్ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్థానంలో విజయానంద్ ను నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. “విజయానంద్ ఐఏఎస్(Vijayanand IAS), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు” అని ప్రభుత్వ కార్యదర్శి (రాజకీయ) ఎస్ సురేష్ కుమార్ ప్రభుత్వ ఉత్తర్వు (GO) లో తెలిపారు.
AP New CS | కాగా, విజయానంద్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆయన తన బ్యూరోక్రాటిక్ కెరీర్‌ను ప్రారంభించారు. 2022 నుండి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP GENCO) ఛైర్మన్‌గా పనిచేశారు. 2023 నుండి అనేక ఇతర కీలక పదవులలో, కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (AP TRANSCO) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.