Vijaysai Reddy: చంద్రబాబు క్షుద్ర విద్యలు నేర్చిన నాగుపాము

-

Vijayasai Reddy sensational comments on Chandrababu in Twitter: ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా టీడీపీ అధినేతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు క్షుద్ర విద్యలు నేర్చిన నాగుపాము అంటూ వ్యాఖ్యానించారు. భూముల్ని కబళించే టీడీపీ కాలనాగుల్ని ప్రభుత్వం అడ్డుకోవటం వల్ల ఇప్పుడు బుసలు కొడుతూ విషం చిమ్ముతోందంటూ దుయ్యబట్టారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా మండిపడ్డారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఏం పీకావంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చివరి ఛాన్స్‌ ఇవ్వాలంటూ.. మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనంపై పడ్డావంటూ దుయ్యబట్టారు. కుల పిచ్చితో మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావని, ఇక ఈ జన్మకి మళ్లీ ముఖ్యమంత్రి కాలేవని అన్నారు.

- Advertisement -

పందులు అశుద్ధం తిన్నట్లు.. ప్రభుత్వ భూముల్ని కాజేయటం, చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఇతర టీడీపీ నేతల పని అని ఆరోపణలు గుప్పించారు. కుక్క నుంచి ముక్క లాగేస్తే ఎలా అరుస్తుందో.. టీడీపీ నేతలు అలాగే అరిచినట్లు మెురుగుతున్నారంటూ ట్వీట్‌ చేశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని ఆరోపించారు. రక్షకులెవరో, భక్షకులెవరో ప్రజలకు తెలుసునని విజయసాయి రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఏ క్షణమైనా జగన్‌, విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అరెస్ట్‌ అవుతారని టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. బెడవాడ ప్రజలు బండకేసి బాదినా తీరు మారలేదనీ.. దున్నపోతులాంటి కొడుకుని రోడ్డు మీదకి వదిలి పాదచారుల ప్రాణాలు తీసినప్పుడు పోలీసులు బూట్లు నాకిన రోజుల్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల తరువాత నీ ఇంటి ముందు బోండాల దుకాణానికి దరఖాస్తు పెట్టుకోరా ఇడియట్‌ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...